న్యాచురల్ స్టార్ నాని, ఈ హీరో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా మారాడు. అయితే ఇండస్ట్రీ కొందరు బడా హీరోలు తాము స్వయంకృషితో పైకి వచ్చాం అని చెప్పుకున్నప్పటికీ వాళ్ళు ఎలా పైకి వచ్చారో అందరికీ తెలిసిందే. అయితే నాని, నాని ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ స్వయంకృషితో వచ్చినట్లు డప్పుకొట్టుకొలేదు. ఇదిలా ఉంటే తాజాగా గత నెల 28న ఆంధ్రుల ఆరాధ్య దైవం, అన్నగారు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జన్మదినం కావడంతో అందరిలాంటి అభిమానిగానే నాని తన అభిమానాన్ని చాటుతూ ఒక ట్వీట్ చేశాడు…‘దేవుడికి తమ జన్మదినోత్సవం ఎప్పుడో స్పష్టంగా తెలియనపుడు వారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవచ్చ’ని నాని తన ట్వీట్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే దూదితో రుద్దినా, పాలతో కడిగినా దురదగుంట ఆకుకి దురద వదలదు అంటారుగా అలా, ఒక బడా హీరోకి చెందిన, ఇంకా చెప్పాలి అంటే ఒక బడా హీరో గ్యాంగ్ కి చెందిన హీరోల అభిమాని ఒకడు నానిపై ఓ కులం గురించి అభియోగాలు మోపాడు.
నాని ఎన్టీఆర్ కులం వాడు కాబట్టే అలా ట్వీట్ చేసాడని తన నీచ మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడు. అయితే దానికి నాని ఎక్కడా సంయమనం కోల్పోకుండా ఘాటుగా స్పందిస్తూ… ‘నేనూ మీలాగే తెలుగువాణ్ని…అన్నగారే కాదు…చిరంజీవికి కూడా వీరాభిమానిని. పెద్దలను గౌరవించే సంస్కారం ఉన్నవాణ్ని’ అని సమాధానం ఇచ్చి ఆ కుల పిచ్చి సన్నాసిని చెప్పుతో కొట్టినట్లు ట్వీట్ చెయ్యడంతో, పాపం ఆ పిచ్చి సన్నాసి ఏం చెయ్యాలో అర్ధం కాక, వాడు పెట్టిన ఆ కులం కంపు ట్వీట్ ని డిలీట్ చేశాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.