మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని హీరో హీరోయిన్లుగా 1986 లో ‘చంటబ్బాయ్’ అనే సినిమా వచ్చింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. జంధ్యాల ఈ చిత్రానికి దర్శకులు. సినిమాలో కామెడీ పుష్కలంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు అనడంలో కూడా అతిశయోక్తి కాదు. ‘మిస్ జ్వాలా’ అంటూ చిరంజీవి పలికే డైలాగులు, సుత్తివేలు- చిరు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా అంటే చాలా హిలేరియస్ గా ఉంటాయి.
ఇప్పుడు యూట్యూబ్ లో ఈ సినిమాని ఒక్కసారి పెట్టుకుంటే కదలకుండా చూసే విధంగా అనిపిస్తుంది. అయితే ఎందుకో ఆ టైంలో ఈ సినిమా విజయం సాధించలేదు. చిరంజీవికి ఉన్న స్టార్ ఇమేజ్ కి ఈ కథ మ్యాచ్ అవ్వలేదు అని.. అప్పట్లో ఆయన అభిమానులు ఈ సినిమాని తిప్పికొట్టారు.
తర్వాత టీవీల్లో చూసిన వాళ్ళు ‘ఈ సినిమాని ఎలా ప్లాప్ చేశారు?’ అని ఆశ్చర్యపోయారు తప్ప.. మిగతా వాళ్ళ టాక్ ను పట్టించుకోకుండా థియేటర్ కి వెళ్లి ఆ సినిమాని చూడలేదు. దీంతో ‘చంటబ్బాయ్’ కి అన్యాయం జరిగిపోయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని నాని గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాత ఆ ఆలోచనను నాని విరమించుకున్నాడు.
ఓ సందర్భంలో ‘చంటబ్బాయ్’ సీక్వెల్ పై నాని మాట్లాడుతూ.. “నేను దర్శకుడు నాగ్ అశ్విన్ ‘చంటబ్బాయ్’ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఆ సినిమాని కరెక్ట్ గా చేస్తే.. థియేటర్లలో కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని మేము గతంలో అనుకున్న మాట నిజం. కానీ నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్’ ఆత్రేయ చేశాడు. అది బాగా వచ్చింది. మంచి విజయం అందుకుంది. ఆ సినిమా చూశాక మేము ‘చంటబ్బాయ్’ లాంటి సినిమా అనే ఆలోచన విరమించుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ఆగస్టు 22 తో ‘చంటబ్బాయ్’ రిలీజ్ అయ్యి 39 ఏళ్ళు పూర్తికావస్తోన్న నేపథ్యంలో నాని గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారాయి.