ఓవర్ సీస్ లో బడా హీరోలకు నాని సవాల్!!
- July 22, 2017 / 01:13 PM ISTByFilmy Focus
టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ తో దూసుకెళ్తున్న హీరోలది ఒక లెక్క సొంతంగా కష్టపడి పైకొస్తున్న నాదో లెక్క అంటున్నాడు మన న్యాచురల్ స్టార్ నాని…అసలు ఏంటి ఆ కదా అంటే మీరే చదవండి మీకే అర్ధం అవుతుంది…మ్యాటర్ లోకి వెళితే…ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఏడు హిట్లు…రెండు హ్యాట్రిక్ సక్సెస్ లు…వెరసి ఒక్కసారిగా తన టాలెంట్ తో దూసుకెళ్తున్నారు నాని…అయితే అదే క్రమంలో పేరుకి చిన్న హీరో అయినా బడా హీరోలకి తన కలెక్షన్స్ తో సవాల్ విసురుతున్నాడు నాని.
ప్రత్యేకంగా ఓవర్ సీస్ వ్యవహారమే తీసుకుంటే లాంగ్ రన్ లో పవర్ స్టార్ మరియు బన్నీ సినిమాలను మించి నాని సినిమా కలెక్షన్స్ ఉండడంతో బడా హీరోలు నానికి టార్గెట్ గా మారారు అన్న టాక్ టాలీవుడ్ లో ఉంది…అయితే ఎవరి రేంజ్ వాళ్ళది కాబట్టి సినిమా రిజల్ట్ ని బట్టి కూడా కలెక్షన్స్ ఉంటాయి అనేది ఒప్పుకుని తీరాల్సిందే… మొత్తంగా అదీ మ్యాటరు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















