ఆ క్రికెటర్ జీవితాన్నే ‘జెర్సీ’ గా తీస్తున్నారా?

  • January 3, 2019 / 12:12 PM IST

2018 వ సంవత్సరం నానికి అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. గతేడాది వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. రొటీన్ ఫార్మాట్ వలనే ఇలా ప్లాపులు వచ్చాయని గ్రహించిన నాని ఇప్పుడు వినూత్న కథాంశంతో ‘జెర్సీ’ చిత్రాన్ని చేస్తున్నాడు. ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు.

న్యూ ఇయర్ కానుకగా ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అయితే ఈ ఫస్ట్ లుక్ పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు ఫిలింనగర్లో చోటుచేసుకుంటున్నాయి. 90ల నేపథ్యంలో సాగే ఓ క్రికెటర్ లైఫ్ ని ఇందులో చూపించబోతున్నట్టు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్తున్నాడు. ఇక 36 ఏళ్ళ వయసులో కొత్తగా రుజువు చేయడానికి ఏమి లేని ఓ యువకుడు 1996-97 రంజీ ట్రోఫీ ద్వారా తానేంటో మళ్ళిప్రపంచానికి చాటాడని నాని ట్వీట్ చేస్తూ ఈ ఫస్ట్ లుక్ ని షేర్ చేసాడు. అదే.. ‘జెర్సి’ చిత్రంలో తన పేరైన అర్జున్ పాత్రని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయం పైనే చర్చ మొదలయ్యింది. నాని చెప్పిన పోలికలు అప్పట్లో సంచలనం సృష్టించిన రామన్ లాంబాలా ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో జరిగిన రంజీ క్రికెట్ లో 87 మ్యాచులు ఆడిన రమణ్ లాంబా 22 సెంచరీలు 5 డబుల్ సెంచరీలు సాధించి రికార్డు నెలకొల్పాడు. 1996-97లో చాలా కష్టమైన నేపథ్యంలో పరుగుల సునామి సృష్టించి ఇండియన్ టీమ్ కు ఎంపికయ్యాడు లాంబా. తరువాత నాలుగు టెస్టులు 32 వండేలలో ఇతని ఇతని సేవలు ఎన్నో ఉన్నాయి. ఇక తన క్రికెట్ లో సాధించిన రెకార్డులకంటే తన జర్నీ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. ఇందుకోసమే గౌతమ్ ఈ కథాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాసాడంటూ ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 19 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక థీమ్ సాంగ్ ఉండబోతుందట. ఈ సాంగ్ కచ్చితంగా ఓ సెన్సేషన్ చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. అనిరుథ్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus