Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం మూవీ థియేట్రికల్ హక్కుల విలువ ఎంతో తెలుసా?

  • January 21, 2024 / 10:19 AM IST

న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సరిపోదా శనివారం తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు తీసుకున్నారని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. 25 కోట్ల రూపాయలకు దిల్ రాజు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. నాని గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా సరిపోదా శనివారం కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా (Saripodhaa Sanivaaram) తెరకెక్కుతోందని తెలుస్తోంది. నాని ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 28 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.

నాని కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మిడిల్ రేంజ్ హీరోలలో నాని టాప్ లో ఉండగా త్వరలో మరికొన్ని ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాని హాయ్ నాన్న మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమాకు ఓటీటీలో సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నాని ఒక సినిమా పూర్తైన తర్వాత మరో సినిమాలో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లకు ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus