నాన్నకు ప్రేమతో ‘కధ’ ముగిసింది!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్న నందమూరి తారక రామారావు గారి మనవడిగా నవరసాలను పండించగల ఎన్టీఆర్ కు మాస్ లో ఉన్న పట్టు చూస్తే బహుశా అలాంటి అభిమానులు వేరే ఏ హీరోకి ఉండరేమో అనిపిస్తుంది. అయితే అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈ కుర్ర హీరో సరికొత్త క్లాస్ లుక్ తో ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగాడు.

నాన్నకు ప్రేమతో అంటూ ఎమోషనల్ టచ్ ఇస్తూనే, లాజికల్ స్క్రీన్‌ప్లే తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ కరియర్ లోనే తొలిసారిగా 50కోట్ల మార్క్ ను దాటిన చిత్రంగా నాన్నకు ప్రేమతో నిలిచింది. అయితే అంతా బాగానే ఉన్నా, సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినా, బయ్యర్స్ కు మాత్రం దాదాపుగా 6కోట్ల వరకూ నష్టాన్నే మిగిల్చింది అని సినీ పండితులు చెబుతున్నారు.

వారి లెక్కల ప్రకారం చూస్తే…నాన్నకు ప్రేమతో చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 39.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాని బయ్యర్స్ కు 33.67 కోట్లు మాత్రమే వచ్చాయి. చివరకు బయ్యర్స్ కు ఇబ్బందులను కొనితెచ్చిపెట్టింది. సినిమా విడుదలయిన ప్రతీ ఏరియాలో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు క్లోజింగ్ బిజినెస్ మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక కర్నాటక, ఓవెర్సీస్ తప్పా..మిగిలిన అన్ని ప్రాంతాల్లో బయ్యర్స్ ను నష్టాలేనే చవిచూశారు. మొత్తానికైతే అటు ఇటుగా ఎన్టీఆర్ 50కోట్ల మార్క్ ను అయితే దాటాడు కానీ, బయ్యర్స్ కు మాత్రం నష్టాన్నే మిగిల్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus