నందమూరి నట సింహం బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో ఆదరణ సంపాదించుకున్నారు. తనలో ఈ యాంగిల్ కూడా ఉందని ఈయన ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా నిరూపించుకున్నారు.ఈ కార్యక్రమం విపరీతమైన ఆదరణ సంపాదించుకోవడంతో మేకర్ రెండవ సీజన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండవ సీజన్ కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమానికి ఊహించని విధంగా తన వియ్యంకులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ ముఖ్య అతిథులకు హాజరయ్యారు.
ఇలా ఈ ముగ్గురి మధ్య ఎన్నో వ్యక్తిగతమైన విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయ అంశాలు కూడా తెరపైకి ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా బాలకృష్ణ తన అల్లుడు నారా లోకేష్ గురించి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కాకుండా గతంలో మినిస్టర్ గా కూడా పనిచేశారు.2019 ఎన్నికల సమయంలో ఈయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ ఎన్నికలలో లోకేష్ ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఈ మంగళగిరి ఓటమి గురించి కూడా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో ప్రస్తావనకి తీసుకోవచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మంగళగిరి గురించి మాట్లాడుతూ… తాను చెప్పాల్సింది ప్రజలకు సరైన విధానంలో చెప్పలేకపోయానని,తాను ఎక్కువ సమయం పాటు ప్రజలతో గడపలేక పోయానని అందువల్లే ఓటమిని ఎదుర్కొన్నానని లోకేష్ తెలిపారు.
ఈ ఓటమి విషయంలో తప్పు మొత్తం తనదేనని ఈయన అంగీకరించారు.అందుకే ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి గెలిచి చూపించాలన్న ఉద్దేశంలోనే గత మూడు సంవత్సరాల నుంచి మంగళగిరిలో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నానని ఈ సందర్భంగా లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!