స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఇందులో విజయ్ సేతుపతి యాక్ట్ చెయ్యడం దాదాపుగా ఖాయమే. మొదట విజయ్ సేతుపతిని ఒక క్యారెక్టర్‌కు సెలెక్ట్ చేశారు. డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక ఆ ఇష్యూలతో సినిమా నుండి తమిళ స్టార్ తప్పుకున్నాడు. అతడి ప్లేస్‌లో నారా రోహిత్‌ను సెలెక్ట్ చేశారని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇన్సైడ్ సోర్స్. డైరెక్టర్ సుకుమార్, నారా రోహిత్‌ను కలిసి కథతో పాటు అందులో అతడి క్యారెక్టర్ గురించి ఫుల్ నేరేషన్ ఇచ్చారని సమాచారం.
ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ క్యారెక్టర్ కీలకంగా ఉంటుందట. అందుకని, అతడు ఓకే చెప్పాడట. చిత్తూరు అడవుల బ్యాక్‌డ్రాప్‌లో సుకుమార్ ‘పుష్ప’ కథ రాసుకున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక చిత్తూరు యాస ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో క్యాస్ట్ అండ్ క్రూ కంటే నారా రోహిత్ ఎక్స్పర్ట్. అతడి చిత్తూరు జిల్లా. పైగా, తెలుగు భాష మీద అతడికి గ్రిప్ ఉంది. డైలాగ్ డెలివరీలో రోహిత్ కాంప్లిమెంట్స్ అందుకున్నాడు.
సొంత జిల్లా యాస కావడంతో అతడికి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పవచ్చు.నవంబర్ నుండి ‘పుష్ప’ షూటింగ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తలకోన, మారేడుమిల్లి, వికారాబాద్ ఫారెస్ట్ లలో ఏదో ఒక ఫారెస్ట్ లో షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.