నారా రోహిత్ (Nara Rohith) ‘భైరవం’ (Bhairavam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన పాత్రతో మెప్పించాడు. రోహిత్ ను ఇలాంటి మంచి పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. వరద అనే పాత్రలో చాలా సెటిల్డ్ గా.. అదే టైంలో పవర్ ఫుల్ గా కనిపించాడు అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. రోహిత్ సినీ కెరీర్లో ఊహించని విధంగా గ్యాప్ వచ్చింది. ‘వీర భోగ వసంత రాయలు’ (Veera Bhoga Vasantha Rayalu) గత ఏడాది వచ్చిన ‘ప్రతినిధి’ (Prathinidhi) వరకు చూసుకుంటే..
దాదాపు 6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ‘ప్రతినిథి 2’ ని (Prathinidhi 2) కూడా రోహిత్ ఎన్నికల కారణంగా సరిగ్గా ప్రమోట్ చేయలేదు. అది రిలీజ్ అయినట్టు కూడా అతను తెలుసుకోలేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే… ఈ 5 ఏళ్లలో రోహిత్ కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే… ‘పుష్ప’ (Pushpa) లో షెకావత్ పాత్ర కోసం ముందుగా నారా రోహిత్ ని సంప్రదించారట.
‘రౌడీ ఫెలో’ (Rowdy Fellow) సినిమాలో నారా రోహిత్ పాత్ర సుకుమార్ కి (Sukumar) నచ్చడంతో.. షెకావత్ పాత్రకి అతను సూట్ అవుతాడు అని సుకుమార్ అనుకున్నాడట. కానీ నారా రోహిత్ ఆ టైంలో ఎందుకో ఓకే చెప్పలేకపోయాడట. ఆ పాత్ర అతను చేసుంటే.. కచ్చితంగా ఇతని కెరీర్ వేరేలా ఉండేది. ఇది మాత్రమే కాదు.. ‘గీత గోవిందం’ కథని కూడా నారా రోహిత్ వదులుకున్నాడట. ‘సోలో’ (Solo) సినిమాని పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో చేశాడు రోహిత్.
ఆ రిలేషన్ తోనే పరశురామ్ వెళ్లి రోహిత్ కి ‘గీత గోవిందం’ (Geetha Govindam) చెప్పాడట. అతని ఓన్ ప్రొడక్షన్లో ఆ సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ తర్వాత ‘గీతా ఆర్ట్స్’ లో అతను సినిమా కమిట్ అవ్వడంతో చేయలేకపోయాడు అని తెలిపాడు. అయితే ‘గీత గోవిందం’ తాను చేసుంటే .. కచ్చితంగా ఆ రేంజ్లో కలెక్ట్ చేసేది కాదని.. విజయ్ (Vijay Devarakonda) ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) మ్యానియాలో ఆ సినిమా చేయడం వల్ల పెద్ద నెంబర్స్ వచ్చాయని ఓపెన్ గానే చెప్పాడు రోహిత్.
గీత గోవిందం గురించి నారా రోహిత్.
“తాను చేస్తే అంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో”
ఇగో లేకుండా నిజాయితీగా చెప్పాడు. pic.twitter.com/T3iVQhvtyU— తెలీదు… గుర్తులేదు… మర్చిపోయాను (@tsr_tweets) June 2, 2025