శరత్ బాబు నాకు పెద్దన్నయ్య లాంటి వారు : వి కె నరేష్

శరత్‌బాబు గారు..కథానాయకుడిగా, సహాయనటుడిగా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు.

ఎన్నో చిత్రాలలో తన నటనతో ప్రేక్షలులని అలరించిన శరత్ బాబు గారు చివరిగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. డా.నరేష్ వి.కె, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలలో ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 26 న విడుదల కానుంది.

శరత్ బాబు మరణం పట్ల మళ్ళీ పెళ్లి చిత్ర యూనిట్ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది చిత్ర బృందం.

డా.నరేష్ వి.కె మాట్లాడుతూ.. శరత్ బాబు గొప్ప విలక్షణ నటుడే కాదు నాకు చాలా ఏళ్ళుగా మంచి మిత్రుడు. పెద్దన్నయ్య లాంటి వాడు. కోకిల లాంటి ఎన్నో మంచి సినిమాలు చేశాం. సాగర సంగమంలో ఆయన చేసిన పాత్ర కొన్ని తరాలు మర్చిపోదు. మా కాంబినేషన్ లో ఆయన చేసిన ఆఖరి సినిమా మళ్ళీ పెళ్లి. సినిమా విడుదల కాకముందే ఆయన వెళ్ళిపోయారు. ఆయన మరణం నిజంగా గుండెల్ని పిండేస్తుంది. ఆనందంగా వుండండి అని చెప్పి వెళ్లారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని ప్రార్థించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus