ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో మనకు తెలిసిందే. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరమై నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు. ఇక వీరిద్దరూ కలిసి జీవించడమే కాకుండా ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని స్వయంగా నరేష్ నిర్మించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ ద్వారా ఈ సినిమాని నరేష్ నిర్మించారు.
ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ తన తల్లి విజయనిర్మలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ 19 సంవత్సరాల వయసులో తన తల్లి ఒకరికి మంచి చేయాలన్న ఉద్దేశంతో నాకు పెళ్లి చేసింది అయితే ఆ పెళ్లి వల్ల నాకు మంచి కన్నా చెడే ఎక్కువ జరిగిందని తెలిపారు. ఇలా తన తల్లి తనకు మంచి చేయడం కోసం మూడు సార్లు పెళ్లి చేసిన తనకు ఏ మాత్రం మంచి జరగలేదని తెలిపారు.
అమ్మ చివరి రోజులలో తనతో మాట్లాడుతూ నిన్ను ఒక రాజుల పెంచిపెద్ద చేశాను కానీ నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను అంటూ చాలా బాధపడిందని నరేష్ ఈ సందర్భంగా తన తల్లి మాటలను గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా తన తల్లి బాధపడుతూ ఉండగా బాధపడాల్సిన పని లేదమ్మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకునే అమ్మాయిని కలిసాను,నాకు మరో అమ్మ దొరికింది అంటూ అమ్మతో ఆరోజు చెప్పానని పవిత్ర లోకేష్ ను చూపిస్తూ నరేష్ కామెంట్స్ చేశారు. నా జీవితం తెరపై సాగినంత సంతోషంగా తెర వెనుక సాగలేదని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని నరేష్ తెలిపారు.
ఎప్పుడైతే పవిత్రతో తనకు పరిచయం ఏర్పడిందో ఆ క్షణం (Naresh) నా జీవితంలో చివరి గమ్యానికి చేరుకున్నాననే అనుభూతి, నమ్మకం పవిత్రను కలిసిన తర్వాతనే తనకు కలిగిందని ఈ సందర్భంగా నరేష్ ఎంతో ఉద్వేగం అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమా మరో మూడు రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి నరేష్ పవిత్ర ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.