ఈ మధ్య కాలంలో వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కన్నడ సింగర్లలో ఒకరైన శివమోగ సుబ్బన్న గుండెపోటుతో మృతి చెందారు. ఛాతీలో నొప్పి రావడంతో శివమోగ సుబ్బన్న కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సకు కోలుకోలేక ఆయన మృతి చెందారు. సుబ్బన్న మరణ వార్త విని ఆయన అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.
శివమోగ సుబ్బన్న కన్నడ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగింగ్ లో జాతీయ అవార్డ్ అందుకున్న తొలి గాయకుడు కావడం గమనార్హం. కాడు కుదురె ఒడి బండిట్టా పాట వల్ల ఆయనకు ఈ అవార్డ్ దక్కింది. కాడు కుదెరె సినిమాలోని ఈ సాంగ్ ను ఈతరం మ్యూజిక్ లవర్స్ కూడా ఇష్టపడతారు. ఆయన సింగర్ కావడంతో పాటు అడ్వకేట్ కూడా కావడం గమనార్హం. 83 సంవత్సరాల వయస్సు ఉన్న సుబ్బన్న మరణ వార్త కన్నడ సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది.
కువెంపు యూనివర్సిటీ 2008 సంవత్సరంలో సుబ్బన్నకు గౌరవ డాక్టరేట్ ను అందించింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సుబ్బన్న మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. సుబ్బన్న మరణం కన్నడ సినీ రంగానికి తీరని లోటు అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దూరదర్శన్, ఆకాశవాణి కార్యక్రమాలలో పాటలు పాడటం ద్వారా సుబ్బన్న అభిమానులకు మరింత దగ్గరయ్యారు.
బారిసు కన్నడ డిండిమావ అనే సాంగ్ కూడా సుబ్బన్నకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కన్నడ సినిమా పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన సుబ్బన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. సుబ్బన్న తన సినీ కెరీర్ లో ఎన్నో పురస్కాలను, అవార్డులను అందుకున్నారు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సుబ్బన్న తన కెరీర్ లో ఎన్నో అద్బుతమైన పాటలు, పద్యాలు పాడారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?