నాని ఈ లాక్ డౌన్లో ‘వి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ఆయన అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. గురువు ఇంద్రగంటి డైరెక్టర్ అనగానే స్క్రిప్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోకుండానే యాక్షన్లోకి దిగిపోయాడు అంటూ నాని పై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. ఏమైనా ఈ చిత్రం రిజల్ట్ తో నాని బాగా హర్ట్ అవ్వడమే కాకుండా.. బాగా అలెర్ట్ అవుతున్నట్టు కూడా స్పష్టమవుతుంది.వివరాల్లోకి వెళితే.. నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ చిత్రంలో నటిస్తున్నాడు.
దాంతో పాటు ‘శ్యామ్ సింగ రాయ’ ప్రాజెక్టుని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. ‘టక్ జగదీష్’ షూటింగ్ ఈమధ్యనే మొదలైంది కానీ.. సెట్స్ లో ఇద్దరికి కరోనా రావడంతో మళ్ళీ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రం రషెస్ చూస్తూ.. కొన్ని సీన్లని రీ షూట్లు చెయ్యాలని దర్శకుడు శివ నిర్వాణకు నాని సూచిస్తున్నాడట. ఇక నాని నటిస్తున్న మరో చిత్రం ‘శ్యామ్ సింగ రాయ’. ముందుగా ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. అయితే బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిపోతుండడంతో వారు తప్పుకున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుని వెంకట్ బోయినపల్లి నిర్మించబోతున్నారు. ఈ చిత్రం బడ్జెట్ పెరిగిపోకుండా.. ప్రీ ప్రొడక్షన్ పనులలో కూడా నాని ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ముందుగా ఈ ప్రాజెక్ట్ కు ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తాడు అన్నారు.. కానీ ఇప్పుడు నాని మిక్కీ జె మేయర్ ను రికమండ్ చేసినట్టు తెలుస్తుంది. ఏమైనా ‘వి’ సినిమా.. నానికి చాలా జాగ్రత్తలు నేర్పినట్టు క్లియర్ గా తెలుస్తుంది.