Jr NTR: గోవాలో.. అంత వేడిలో.. ‘దేవర’ కష్టాలు చెప్పిన తారక్‌.. వామ్మో అంటూ..!

ఇది ‘దేవర’ (Devara) టైమ్‌. ఎన్టీఆర్‌ (Jr NTR)  – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందిన ఈ రెండు పార్టుల సినిమాలో తొలి పార్టు విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. నిజానికి మాట్లాడాలి కూడా. ఎందుకంటే సినిమా కోసం టీమ్‌ అంత కష్టపడింది. ప్రచార చిత్రాల్లో కూడా మనకు అదే అర్థమవుతోంది. 30 నిద్రలేని రాత్రులు ఉన్న ‘దేవర’ సినిమా వెనుక అని సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు (R. Rathnavelu)  కూడా చెప్పారు.

Jr NTR

తాజాగా సినిమా కోసం పడ్డ కష్టాల్లో కొన్నిటిని తారక్‌ చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్‌లో భాగంగా గోవాలో చిత్రీకరణ జరిపినప్పుడు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. దీంతో ఆ విషయాలు వైరల్‌గా మారాయి. ‘దేవర’ సినిమా కోసం మిగిలిన భాష‌ల్లో ప్ర‌మోష‌న్స్ బాగా చేస్తున్నారు.. కానీ తెలుగు పరిశ్రమను మరచిపోయారు అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరో రికార్డెడ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. గతంలో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇంటర్వ్యూ చేయగా..

ఇప్పుడు యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ చేశారు. గోవాలో బీచ్‌లో సినిమా షూటింగ్‌ చేసినప్పుడు వామ్మో అనుకునే పరిస్థితులు ఎదురయ్యాయట. గోవా బీచ్‌లో ఓ రేంజి ఎండ ఉంటుందనే విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితిలో సూర్యుడు నిప్పులు చెరుగుతుంటే ఆ వేడికి త‌ట్టుకోలేక‌ ఇబ్బందిపడ్డాడట తారక్‌. దాంతో ప‌క్క‌నే ఉన్న టెంట్‌లోకి ప‌రిగెత్తాడ‌ట‌. అక్కడే ఓ ట్విస్ట్‌ వచ్చిందట. ఎన్టీఆర్‌ అలా టెంట్‌లోకి వెళ్లేస‌రికి.. క‌రెంట్ ఆగిపోవడంతో ఏసీ ఆఫ్‌ అయ్యింద‌ట‌.

ఆ స‌మ‌యంలో అక్కడ జ‌న‌రేట‌ర్ ప‌ని చేయ‌లేద‌ట. దీంతో అలా లోప‌ల ఉంటే ఇడ్లీలో ఆవిరి పోయినట్లు తనలో ఆవిరి పోతుందేమో అని అనిపించిందట. పోనీ బ‌య‌ట‌కు వెళ్దామంటే తందూరీ చికెన్‌లా అయిపోతానేమో అనిపించిందట. ఏదైతే అది అని వెయిట్‌ చేస్తే.. 45 నిమిషాల త‌ర‌వాత క‌రెంట్ వ‌చ్చిందట. హమ్మయ్య అని తారక్‌ అనుకునేలోగా ‘షాట్ రెడీ’ అంటూ దర్శకుడు కొర‌టాల నుండి పిలుపు వ‌చ్చింద‌ట. దీంతో ఈ క‌ష్టం ప‌గ‌వాడికి కూడా రాకూడ‌ద‌ని నడుచుకుంటూ వెళ్లాడట తారక్‌. మరి ఈ కష్టానికి ఎలాంటి ఫలితం వస్తుందో వచ్చే వారాంతంలో తెలుస్తుంది.

ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఆ అప్ డేట్ వచ్చే ఛాన్స్ లేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus