డ్రగ్స్ బానిసల్లో టాప్ హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు – నవదీప్!!

టాలీవుడ్ లో డ్రగ్స్ విషయం ఇప్పుడు పరిశ్రమలోని మూలాలను సైతం కదుపుతుంది, ఎవ్వరూ ఎప్పుడు ఎలా ఈ విషయంలో బయట పడతారో అన్న టెన్షన్ అందరిలో కలుగుతుంది. ఇప్పటికీ గత నాలుగు రోజుల నుంచి సిట్ విచారణ చేపట్టిన కోణంలో పూరీ జగన్నాధ్, సుబ్బరాజు, శ్యామ్ కె నాయుడు, తరుణ్, ఇంకా నవదీప్ అందరూ సిట్ ముందు హాజరు అయ్యి సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అనే మీడియా చెబుతుంది. అయితే అందరితో విచారణ ఒక ఎత్తు అయితే, ఈరోజు జరిగిన నవదీప్ తో విచారణ మరో ఎత్తు అన్న న్యూస్ ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తుంది. దాదాపుగా 11 గంటల సుధీర్గ విచారణ తరువాత నవదీప్ గురించి బయటకు వచ్చిన మ్యాటర్స్ ఇప్పుడు టాలీవుడ్ లో ఎందరో అగ్ర హీరోలకు, హీరోయిన్స్ కి చమటలు పట్టేలా చేస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఈరోజు నవదీప్ తో విచారణ మొదలు అయిన కొన్ని గంటల వరకూ అసలు కెల్విన్ ఎవరో తనకు తెలీదు, అసలు పరిచయమే లేదు అన్నట్లుగా కవర్ చెయ్యడానికి ట్రై చేసాడట, అయితే సాక్ష్యాలు అన్నీ బయటకు తీసి సిట్ అధికారులు తమ విశ్వరూపం చూపించడంతో అడ్డంగా దొరికిపోయిన నవదీప్ కొన్ని సెన్సేషనల్ మ్యాటర్స్ సీట్‌కీ అందించాడట.

తాను పాట్నర్ గా ఉన్న బిపీఎం పబ్ లో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు, డ్రగ్స్ సరఫరా చేసినట్లు, ఇంకా చెప్పాలి అంటే, కెల్విన్ తో తరచుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు, అంతేకాకుండా గత కొంత కాలంగా తనకు డ్రగ్స్ అలవాటు ఉంది అని నవదీప్ చెప్పినట్లు సమాచారం. ఇక అదే క్రమంలో తన పబ్ కి వచ్చే వారిలో తాను డ్రగ్స్ అందజేసిన కొందరు బడా హీరోలు, టాప్ హీరోయిన్స్ కూడా ఉన్నారని నవదీప్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఎందరో రాజకీయ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, కమీడియన్స్ సైతం ఈ డ్రగ్స్ కు బానిసలు అని నవదీప్ విచారణలో తెలిపినట్లు న్యూస్ చానెల్స్  బలంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే నవదీప్ పై సిట్ పూర్తి ఫోకస్ పెట్టినట్టు, వారు అనుకున్న విధంగా నవదీప్ మొత్తం చెప్పేసినట్లు తెలుస్తుంది. మరి ఈ మ్యాటర్ వింటూ ఉంటే, ఈ వ్యవహారంలో ఇంకెంత మంది బయటకు వస్తారో అన్న టెన్షన్ ఇప్పుడు టాలీవుడ్ లో కనిపిస్తుంది. మరి ఈ మ్యాటర్ ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus