సెప్టెంబర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘న‌వాబ్’ విడుద‌ల‌

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కున్న ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈయ‌న డైరెక్ష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `న‌వాబ్‌`. లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళంలోసెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ సంస్థ‌ల ప్ర‌తినిధులు మాట్లాడుతూ – “న‌వాబ్ సినిమాను సెప్టెంబర్ 27న తెలుగు, త‌మిళ భాషల్లో గ్రాండ్‌రిలీజ్ చేస్తున్నాం. ముందుగా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ … తాజాగా ఓ రోజు ముందుగానే అంటే సెప్టెంబ‌ర్ 27నే సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నాంరీసెంట్‌గా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌ణిర‌త్నంగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌వాబ్‌`మంచి యాక్ష‌న్ ప్యాక్‌డ్ మూవీ. ఎమోష‌నల్ కంటెంట్‌తో సాగే చిత్ర‌మిది. అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్ వంటి భారీ తారాగ‌ణంతో , ఎ.ఆర్‌.రెహమాన్‌, సంతోశ్ శివ‌న్‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి టాప్ టెక్నీషియ‌న్స్ స‌హ‌కారంతో తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉటుంద‌నడంలో సందేహం లేదు“ అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus