పాన్ ఇండియా హీరోలలో ఒకరైన ప్రభాస్ ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ సినిమాకు సులువుగా 200 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ నయనతార వినాయక్ కాంబినేషన్ లో యోగి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా క్లైమాక్స్ లో చేసిన తప్పు వల్ల కమర్షియల్ గా ఫ్లాపైంది. ప్రభాస్ నయన్ జోడీకి మంచి పేరు వచ్చినా ఆ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు.
అయితే నయనతార నటించిన కనెక్ట్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో నయన్ ఖాతాలో మరో సక్సెస్ చేరినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమా నిడివి మరీ తక్కువగా ఉండటం ఈ సినిమాకు ఒకింత మైనస్ అవుతోంది. కనీసం రెండు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే కనెక్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ అల్లరి పిల్లవాడు అంటూ నయనతార కామెంట్లు చేశారు. ప్రభాస్ మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని ఆమె అభిప్రాయపడ్డారు. షూటింగ్ సెట్ లో ప్రభాస్ ఎంతో అల్లరి చేసేవాడని ఆమె అన్నారు. ప్రభాస్ అల్లరిని తట్టుకోవడం తేలిక కాదని నయనతార అభిప్రాయం వ్యక్తం చేశారు. యోగి షూట్ సమయంలో అల్లరి పిల్లాడు అయిన ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా హీరో అయ్యాడని తెలిసి సంతోషంగా ఉందని నయనతార పేర్కొన్నారు.
మాస్ మహారాజ్ రవితేజ నేను మంచి స్నేహితులమని ఆమె తెలిపారు. రవితేజ హిందీ భాష అనర్గళంగా మాట్లాడతాడని మేము హిందీలోనే మాట్లాడుకుంటామని ఆమె అన్నారు. రవితేజ నయనతార కాంబినేషన్ లో ఆంజనేయులు సినిమా తెరకెక్కగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. కనెక్ట్ సినిమా కమర్షియల్ గా ఏ స్థాయి హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.