Nayanthara: నయన్ ఆ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది..!

కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌ ఈ మధ్యనే తన ప్రియుడు విఘ్నేశ్ శివ‌న్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. తమిళ నాడులోని మ‌హాబ‌లిపురంలో ఉన్న షెర‌టాన్ పార్క్ హోట‌ల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.దాదాపు 7 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.నయన్ క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ పద్దతిలోనే విగ్నేష్ ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి జరిగినప్పటి నుండి ఈమె కొన్ని సెంటిమెంట్లను ఫ్యాషన్ గా మార్చేసిందేమో అనిపిస్తుంది.

నిజానికి పెళ్ళిలో పెళ్లి కూతురుకి పసుపు రంగు చీర కడతారు. కానీ నయన్ మాత్రం విగ్నేష్ కుటుంబ ఆచారం ప్రకారం.. ఎరుపు రంగు చీర ని ధరించింది. 15 మంది డిజైనర్స్ తో దాదాపు రూ.25 లక్షల ఖర్చు చేసి మరీ ఈమె ఆ చీరని తయారు చేయించుకుంది. ఇక పెళ్లి తర్వాత నయన్ ఇప్పటికీ పసుపుతాడుని ధరిస్తూనే ఉంది. సాధారణంగా పెళ్లి కూతురు మెడలో పసుపుతాడుని ఒక వారమో, రెండు వారాలో ఉంచుతారు.

అటు తర్వాత బంగారం తాళి/మంగళసూత్రం ధరింపజేస్తారు. కానీ నయన్ పెళ్లి చేసుకుని నెల రోజులు దాటినా ఇంకా పసుపు తాడునే ధరిస్తుంది. ఓ రకంగా పసుపు తాడుని ఫ్యాషన్ గా మార్చేసింది అనే చెప్పాలి. ఇటీవల ఈమె షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న ‘జవాన్’ షూటింగ్ కు హాజరైంది. అక్కడ తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

ఇందులో నయన్ పసుపు తాడుని ధరించి కనిపిస్తుంది. ఇక పెళ్ళైనప్పటికీ ఈమె సినిమాలకు బ్రేక్ ఇవ్వను అని ముందుగానే చెప్పింది.పెళ్ళికి ముందు కమిట్ అయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయని వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉంది అని ఈమె తెలిపింది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus