బాలయ్యకు బోయపాటే సరైనోడు…టీజర్ చంపేశారు!

  • June 9, 2020 / 08:08 PM IST

బాలయ్య ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ బర్త్ గిప్ట్ తో వచ్చేశాడు. ఆయన 106వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ టీజర్ ని విడుదల చేసి బాలయ్య ఫ్యాన్స్ ని నిరాశపర్చడని నిరూపించాడు. నిమిషానికి పైగా ఉన్న టీజర్ లో బాలయ్య లుక్ సరికొత్తగా ఉంది. ఆయన ఈ సారి తెల్ల చొక్కా, పంచె కట్టులో పెద్దరికాన్ని తలపించారు. ఎప్పటి లాగే తన మార్కు ఓ మాస్ డైలాగ్ తో టీజర్ దద్దరిల్లేలా చేశాడు. “ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో… శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి…శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి.. చాలా తేడా ఉందిరా లమ్బి కొడకా…” అని బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ కలిగించింది.

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బీజీఎమ్ బాలయ్య పాత్రకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఇక బాలయ్య లుక్ చూస్తే ఆయన ఓ పాత్రలో ఊరికి పెద్ద దిక్కు, అందరి తలలో నాలుకలా ఉండే గౌరవ ప్రదమైన పాత్ర చేస్తున్నారు అనిపిస్తుంది. ఊరిలో అందరికి అండగా, చెడ్డవారి గుండెల్లో భయంలా ఆయన పాత్ర ఉండే అవకాశం ఉంది. బాలయ్య లుక్ ఈ మధ్య అనేక విమర్శలకు గురికాగా బోయపాటి పర్ఫెక్ట్ గా సెట్ చేశారు.

రెండు భిన్న గెటప్స్ లో బాలయ్య కనిపిస్తుండగా ఓ రోల్ సూపర్ సక్సెస్ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక బోయాపాటి మార్కు భారీ యాక్షన్ సన్నివేశాలకు ఏమాత్రం కొదవ ఉందన్న విషయం కూడా టీజర్ చూస్తే తెలిసిపోతుంది. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు చాలు అన్నట్లు, టీజర్ తోనే సినిమా సూపర్ హిట్ అని చెప్పేశారు. కాగా బాలయ్య తెరపై భీబత్సం చేయడం ఖాయం అనిపిస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతగా మిర్యాల రవీంద్రా రెడ్డి ఉన్నారు.

1

2

3

4

5

6

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus