Pushpa Movie: ఆ విమర్శలపై సుకుమార్ ఏమంటారో?

  • August 31, 2021 / 05:38 AM IST

దర్శకుడు సుకుమార్ తన ప్రతి సినిమాలో ఊహించని లాజిక్స్ తో ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ పుష్ప మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ పండుగ కానుకగా పుష్ప పార్ట్1 రిలీజ్ కానుండగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫహద్ ఫాజిల్ లుక్ రిలీజ్ కాగా ఆ లుక్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఫహద్ ఫాజిల్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తుండగా పోస్టర్ లో ఫహద్ ఫాజిల్ కు మెల్లకన్ను ఉన్నట్టు చూపించారు. మెల్లకన్ను ఉన్న వ్యక్తి ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపిక కావడం రియల్ లైఫ్ లో జరగదు. అయితే సుకుమార్ ఇంత చిన్న లాజిక్ ను ఏ విధంగా మిస్సయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా రిలీజైతే మాత్రమే ఫహద్ ఫాజిల్ లుక్ వెనుక సీక్రెట్ ఏంటో ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంటుంది.

మరోవైపు ఫహద్ ఫాజిల్ గుండును కూడా నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. వేర్వేరు వ్యక్తులతో ఫహద్ ఫాజిల్ లుక్ ను పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బన్నీని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుకుమార్ చూపిస్తూ ఉండటంపై ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఒకవైపు అంచనాలను పెంచుతూనే మరోవైపు సందేహాలను కూడా అదే స్థాయిలో పెంచుతున్నారు. పాన్ ఇండియా నటుడిగా ఫహద్ ఫాజిల్ కు ఉన్న క్రేజ్ పుష్ప సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus