హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

‘ఓజీ’ సినిమాలో గన్స్‌ భారీగా ఉండనున్నాయి అని ఇప్పటివరకు వచ్చిన టీజర్‌, పాటలు చూస్తే తెలిసిపోతోంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కదా ఆ మాత్రం ఉంటుందిలే అనుకుందాం. అయితే ఇప్పుడు గన్స్‌తోపాటు గులాబీలు లాంటి హీరోయిన్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. తాజాగా హీరోయిన్ల లిస్ట్‌లోకి మరో యువ కథానాయిక వచ్చింది చేరింది. ఆమెనే ‘డీజే టిల్లు’ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అందచందాలతో మెప్పించిన నేహా శెట్టి కూడా ఇప్పుడు ‘ఓజీ’లో భాగమైంది అని చెబుతున్నారు.

Neha Shetty

‘ఓజీ’ సినిమాలో నేహా శెట్టి పాత్ర ఓ సర్‌ప్రైజ్‌లా కనువిందు చేయనుంది అని చెబుతున్నారు. నేహా ఇందులో పవన్‌తో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతుందట. దాంతోపాటు కొన్ని సన్నివేశాల్లో కూడా ఆమె నటించిందట. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ అంటూ టీమ్‌ అనౌన్స్‌ చేసిన పాటలోనే నేహా కనిపిస్తుంది అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ‘ఫైర్ స్ట్రామ్‌’, ‘సువ్వి సువ్వి’, ‘ఓమి’ పాటలు అదిరిపోయే రెస్పాన్స్‌ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పాట ఏ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

సెప్టెంబర్ 15 సాయంత్రం 4.50 గంటలకు ‘గన్స్ అండ్ రోజెస్’ పాట రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ వారంలో సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తారని సమాచారం. అలాగే 20వ తేదీన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ ఈవెంట్‌ నిర్వహిస్తారని భోగట్టా. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని టాక్‌. సెప్టెంబర్ 24న విదేశాల్లో ప్రీమియర్ షోలు పడతాయి. సెప్టెంబర్ 25న మన దగ్గర సినిమా రిలీజ్‌ అవుతుంది.

ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించగా, ఐశ్వర్య మేనన్‌ను ఓ పాత్ర కోసం తీసుకున్నారు. ఇప్పుడు నేహా శెట్టి కూడా నటిస్తోందని వార్తలు వచ్చాయి. వీరు కాకుండా మరో హీరోయిన్‌ కూడా ఈ సినిమాలో ఉందని టాక్‌. ఆమె ఎవరు అనేది థియేటర్‌లోనే చూడాలి అని అంటున్నారు.

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus