‘శివమ్’ వంటి డిజాస్టర్ సినిమాతో రామ్ డౌన్ అయిన రోజులు అవి.అది మాస్ సినిమా. బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. సరిగ్గా 3 నెలల్లో ‘నేను శైలజ'(Nenu Sailaja) అనే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. 2016 జనవరి 1న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అప్పటికి ‘సెకండ్ హ్యాండ్’ అనే ఒక్క సినిమా అనుభవం కలిగిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సినిమా ఇది.
ప్రమోషన్ అంతంత మాత్రమే. కానీ సాంగ్స్ మాత్రం చార్ట్ బస్టర్స్ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు కిషోర్ తిరుమల రాసిన కొన్ని డైలాగులు బాగా పేలాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. అందువల్ల సంక్రాంతికి సినిమాల పక్కన కూడా నిలబడి మంచి వసూళ్లు సాధించింది.
ఈ 2026 జనవరి 1 కి ‘నేను శైలజ’ వచ్చి 10 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 7.05 cr |
| సీడెడ్ | 2.38 cr |
| ఉత్తరాంధ్ర | 1.92 cr |
| ఈస్ట్ | 1.16 cr |
| వెస్ట్ | 0.95 cr |
| గుంటూరు | 1.44 cr |
| కృష్ణా | 1.20 cr |
| నెల్లూరు | 0.53 cr |
| ఏపీ+తెలంగాణ టోటల్ | 16.63 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.52 cr |
| ఓవర్సీస్ | 2.40 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 20.55 కోట్లు(షేర్) |
‘నేను శైలజ'(Nenu Sailaja) చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.20.55 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4.55 కోట్ల లాభాలు మిగిల్చి సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.రామ్ ని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది.