Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

ఒకప్పుడు సినిమా నిడివి రెండు గంటలు దాటితేనే ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చుంటాడా అనే సందేహాలు వ్యక్తమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కథ బలంగా ఉంటే, ఎమోషన్ గట్టిగా కనెక్ట్ అయితే, సినిమా ఎంతసేపైనా ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ప్రస్తుతం 3 గంటలు దాటిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధిస్తూ కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయి అనే చెప్పాలి.

Movie Runtime

ఇటీవలి కాలంలో కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్న దర్శకులు ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సినిమాలు ఈ విషయంలో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. రామ్ చరణ్ హీరోగా తెరెకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం దాదాపు మూడు గంటల నిడివితో వచ్చినప్పటికీ అద్భుత విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ‘పుష్ప-1’, అలాగే కొనసాగింపుగా వచ్చిన ‘పుష్ప-2’ కూడా ఎక్కువ రన్‌టైమ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇంకొకవైపు, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, తన మొదటి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ తోనే భారీ నిడివి ఉన్న సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చి చూపించారు. తర్వాత వచ్చిన ‘యానిమల్’ చిత్రం కూడా అదే ఫార్ములాను కొనసాగిస్తూ భారీ విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌ సంచలన డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ‘ధురంధర్ 1’ ఏ మాత్రం హడావిడి లేకుండా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘ధురంధర్ 2’ తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా గమనిస్తే, ఇప్పుడు సినిమా విజయాన్ని నిర్ణయించేది రన్‌టైమ్ కాదు.. కథ మరియు కథనంలో కంటెంట్ బలంగా ఉంటే నిడివి కేవలం సంఖ్య మాత్రమే అని ఈ సినిమాలు స్పష్టంగా నిరూపించాయి. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న ఈ సమయంలో, బలమైన కథతో వచ్చిన ఏ సినిమా అయినా ఎంతసేపైనా సక్సెస్ అవుతుందనే విషయం ఇండస్ట్రీకి కొత్త దారిని చూపిస్తోందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus