Nagarjuna: నాగార్జునకు సామాన్యుని సూటి ప్రశ్న.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ కపుల్స్ లో నాగార్జున అమల జోడీ ఒకటనే సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అమల పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు కొంతకాలం గుడ్ బై చెప్పారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమల తల్లి పాత్రల్లో నటిస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కమర్షియల్ గా సక్సెస్ సాధించడం కంటే మనస్సుకు నచ్చే పాత్రలలో నటించడానికే అమల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే అమలకు మూగజీవులపై ఎంతో ప్రేమ అనే సంగతి తెలిసిందే. మూగజీవులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆమె అస్సలు తట్టుకోలేరు. బ్లూ క్రాస్ ద్వారా అమల మూగజీవాలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బ్లూ క్రాస్ వల్ల సినిమాలలో ప్రస్తుతం జంతువులకు సంబంధించిన ఏవైనా సన్నివేశాలు ఉంటే ఆ సన్నివేశాలను గ్రాఫిక్స్ లో షూట్ చేస్తున్నారు. అయితే అమల చాలా సంవత్సరాల క్రితం దాఖలు చేసిన పిటిషన్ వల్ల వీధి కుక్కలను చంపే హక్కు మనుషులకు లేదు.

అయితే కొన్ని ప్రాంతాలలో వీధికుక్కల వల్ల సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఒక వ్యక్తి వీధికుక్కల బెడద వల్ల ఇబ్బంది పడి జీ.హెచ్.ఎం.సీని సంప్రదించగా ఆ వ్యక్తి ప్రశ్నకు జీ.హెచ్.ఎం.సీ ప్రైవేట్ కాంట్రాక్టర్ అమల పిటిషన్ వల్ల దాడులు చేస్తున్న వీధికుక్కల విషయంలో తాము ఎలాంటి సహాయం చేయలేమని చెప్పారని పేర్కొన్నారు.

ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి ఊహించని సమాధానం రావడంతో మధ్యతరగతి ప్రజలను మీ భార్య ఎందుకు వేధిస్తోందంటూ ఆదర్శ్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా నాగార్జునను ప్రశ్నించారు. వీధికుక్కలను మీ ఇంటి ముందు ఉంచితే నాగార్జున గారికి ఆ బాధ తెలుస్తుందని సదరు వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదర్శ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి కొంతమంది ఆదర్శ్ ను సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు అమలను సపోర్ట్ చేస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus