రామ్ పోతినేని, శ్రీలీల హీరోయిన్లుగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన స్కంద మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అయితే ట్రైలర్ చూసిన ప్రేక్షకులలో కొంతమంది మాత్రం ఈ ట్రైలర్ రొటీన్ గా ఉందని బోయపాటి శ్రీను మార్కుతో గత సినిమాలను గుర్తు చేసే విధంగా ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అఖండ, సరైనోడు, జయ జానకి నాయక సినిమాల ఛాయలు ఈ ట్రైలర్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ రోల్ వినయ విధేయ రామ సినిమాలోని హీరోయిన్ రోల్ ను గుర్తు చేసే విధంగా ఉందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి శ్రీను టేకింగ్ కొత్తగా ఉండేలా చూసుకోవాలని కొంతమంది చెబుతున్నారు. థమన్ బీజీఎం మాత్రం ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. బోయపాటి శ్రీను సినిమాలకు థమన్ ప్రాణం పెట్టి పని చేస్తారని మరోసారి ప్రూవ్ అయింది.
స్కంద సినిమాకు బోయపాటి శ్రీను పారితోషికం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను అఖండ2 సినిమాపై దృష్టి పెట్టనున్నారు. 2024 ఎన్నికల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అఖండ2 సినిమాను బోయపాటి శ్రీను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అఖండ2 సినిమాలో యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది.
బాలయ్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి ఈ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ సక్సెస్ లను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.