Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?
- November 18, 2026 / 07:35 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ నిర్మాత నాగవంశీకి పూజా హెగ్డే అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. గతంలో కొన్ని సందర్భాల్లో ఆయనే చెప్పారు కూడా. అయితే అంత అభిమానించే హీరోయిన్‌ను కాదని, ఓ సినిమాలో శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను మరికొన్ని సినిమాల్లోకి కూడా తీసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెను తప్పించేసి వేరే హీరోయిన్ ఆ పాత్రకు తీసుకోవడం కొసమెరుపు. సినిమా డేట్స్ విషయంలో ఇబ్బందితో అలా చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అలా అనిపించడం లేదు.
Naga Vamsi – Sreeleela
ఇటీవల ‘ఓ.ఎం.’ సినిమా ఈవెంట్‌కి అతిథిగా వచ్చిన నిర్మాత నాగవంశీ.. కథానాయిక శ్రీలీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు, తన చెల్లి శ్రీలీలకు గొడవలు ఎక్కువైపోయి సినిమాలు తగ్గిపోయాయన్నారు. కానీ సాయి అభ్యంకర్ బర్త్ డేకి వచ్చిన గ్లింప్స్ చూశానని.. అదిరిపోయిందని చెప్పారు. శ్రీలీల మేకప్ లేకుండా అదిరిపోయిందని అందరికీ చెప్పానని నాగవంశీ చెప్పుకొచ్చారు.
ఇక్కడే ఓ పాయింట్ గమనించాలి. నాగవంశీ నిర్మించిన ‘కింగ్డమ్’, ‘లెనిన్’ సినిమాల్లో చిత్రాల్లో మొదట తీసుకుంది శ్రీలీలనే. తర్వాత ఏం జరిగిందో ఏమో, రెండు సినిమాల్లో వేరే హీరోయిన్లు వచ్చారు. ఆమె బాలీవుడ్‌కి, కోలీవుడ్‌కి వెళ్లిపోవడం వల్ల అలా అనుకున్నారంతా. కానీ ఇప్పుడు నాగవంశీ మాటలు వింటుంటే వేరే ఏదో ఉంది అనిపిస్తోంది. అన్నట్లు ఇదే కార్యక్రమంలో శ్రీలీల మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తర్వాత శ్రీలీల తెలుగులో సినిమా చేయలేదు. కోలీవుడ్‌లో ధనుష్ ‘ఓ.ఎం’, అజిత్ ‘డేర్ డెవిల్’, రజనీకాంత్ ‘ధర్మన్’ చేస్తోంది. సినిమాల కథల ఎంపిక గురించి మాట్లాడుతూ “ఇండస్ట్రీలో నా జర్నీ అందరికీ తెలుసు. చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చాను. ఆ టైంలో నాకు వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకుని చేశాను. అయినా మీరు ప్రేమ చూపించారు. కానీ నాకు కొంచెం టైం దొరికినప్పుడు ఆలోచించాను. ఎక్కడ తప్పు చేస్తున్నా, ఏం జరుగుతోంది అని చూసుకున్నాను’’ అని చెప్పింది. ఆ మాటలు చూస్తుంటే ఇంతకుముందు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పేసుకుని సినిమాలు చెయ్యడం వల్ల తప్పు జరిగిందని శ్రీలీల చెప్పకనే చెప్పినట్లు అయింది.















