శ్రీదేవి సాంగ్ పై నెటిజన్ల కామెంట్స్ వింటే అవాక్కవ్వాల్సిందే!

  • December 20, 2022 / 10:19 AM IST

చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. త్వరలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 16 గంటల్లో ఈ సాంగ్ లిరికల్ వీడియోకు 4.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ లిరికల్ వీడియోలో చిరంజీవిని చూసిన నెటిజన్లు చిరంజీవి వయస్సు ఏకంగా 20 సంవత్సరాలు తగ్గిందని కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవి డ్యాన్స్ లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ఆయనకు ఆయనే సాటి అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి లుక్స్ బాగున్నాయని క్లాస్ లుక్ కూడా చిరంజీవికి బాగా సూట్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో మెగాస్టార్ కు మరో సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే సాంగ్ నిడివి మరీ తక్కువగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సాంగ్ నిడివి కనీసం 4 నిమిషాలు ఉండి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. చిరంజీవి డ్యాన్స్ విషయంలో ఎప్పుడూ నిరాశపరచరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అంటూ కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి అంటే స్టార్ హీరో మాత్రమే కాదని ఆయన ఒక ఎమోషన్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది మెగా ఫ్యాన్స్ ఈ సాంగ్ ను రిపీట్ మోడ్ లో చూస్తున్నారు.

ఫ్యాన్స్ చిరంజీవిని ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో వాల్తేరు వీరయ్య మూవీ అదే విధంగా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోగా నటించిన రవితేజ కూడా ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus