Ram Charan: ఆ విషయంలో చరణ్ గ్రేట్ అంటున్న ఫ్యాన్స్!
- May 14, 2022 / 02:11 PM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకైనా, స్టార్ హీరోగా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడని హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరని చెప్పవచ్చు. నిజ జీవితంలో భక్తి భావం, అధ్యాత్మిక చింతన ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు కాగా ప్రతి సంవత్సరం చరణ్ అయ్యప్పస్వామి మాల వేసుకుంటారు.
ఇతర హీరోలతో కూడా స్నేహపూర్వకంగా మెలిగే హీరోగా రామ్ చరణ్ కు పేరుంది. తాజాగా రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో చరణ్ శివుని ఆలయంలో శివలింగాన్ని శుద్ధి చేస్తూ కనిపించారు. వైట్ షర్ట్, పంచె ధరించి రామ్ చరణ్ వీడియోలో ట్రెడిషనల్ లుక్ లో కనిపించడం గమనార్హం. బిషాంబర్ వాల్మీకీ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేశారు.

సదరు వ్యక్తి సెలబ్రిటీలకు రామ్ చరణ్ రోల్ మోడల్ అని చెప్పడంతో పాటు రామ్ చరణ్ సింప్లిసిటీని ప్రశంసించారు. ఈ వీడియోకు భారీస్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం. ఎంత ఎదిగినా రామ్ చరణ్ ఒదిగి ఉంటారని రామ్ చరణ్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతభాగం పూర్తైంది.

ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చరణ్ ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలతో పాటు చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో చరణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!
















