‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. చేసిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత నేచురల్ స్టార్ నాని తో ‘నేను లోకల్’ చిత్రంతో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక అప్పటి నుండీ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది కీర్తి. 2018 లో పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. ఇక 2018 సమ్మర్ లో విడుదలైన ‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయిది. అయితే ఇటీవల కీర్తి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తన పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ఈ విషయం పై కీర్తి మాట్లాడుతూ.. ‘ నాకు అప్పుడే పెళ్ళి వయసు రాలేదు, నేనింకా చిన్నపిల్లనే’.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది.. అయితే మీకు ఎలాంటి వరుడు కావాలి అనడిగిన ప్రశ్నకు… తమిళ హీరోలు విజయ్, విక్రమ్ వంటి వాడు కావాలని సమాధానమిచ్చింది. అయితే మళయాళం నుండి వచ్చిన తనకి హీరోయిన్ గా మార్చిన టాలీవుడ్ పక్కన బెట్టి కోలీవుడ్ హీరోలు వంటి వారిని కోరుకోవడం పట్ల.. కీర్తిసురేష్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. తెలుగులో ఉన్న హీరోలు మీకు కనబడలేదా.. అంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే.. కేవలం తమిళ ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేయడానికి ఇలా చెప్తుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయం పై కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..!