‘వాట్ ఈజ్ దిజ్’ గౌతమ్ జీ.. ‘తూటా’ ట్రైలర్ పై కామెంట్స్!

ప్రతీ దర్శకుడికి ఓ ఫార్మేట్ ఉంటుంది. అలాగే ఓ స్టయిల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. ఈ విషయంలో ఎవ్వర్నీ తప్పనలేం..! అయితే అది సినిమాకి ప్రధాన బలం అవ్వాలి కానీ.. రిపీట్ చేసి విసిగించకూడదు. అలా చేస్తే ప్రేక్షకులు ఆ దర్శకుడిని షెడ్డుకి పంపేయడం ఖాయం. మన టాలీవుడ్ లో చెప్పుకోవాలి అంటే.. దర్శకుడు శ్రీనువైట్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ లిస్ట్ లో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా చేరినట్టు కనిపిస్తుంది. ఈయన డైరెక్షన్లో రాబోతున్న తాజా చిత్రం ‘తూటా’.

ధనుష్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది, కాగా ఈ ప్రమోషన్లలో భాగంగా.. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ట్రైలర్ మొదలైనప్పటి నుండీ చివరి వరకూ మనకి కొత్తగా ఏమీ అనిపించదు. చాలా వరకూ ఈ ట్రైలర్.. గతంలో గౌతమ్ మీనన్.. నాగ చైతన్య తో తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో చూసిన సీన్లతోనే ఉంది. అక్కడక్కడా వెంకటేష్ తో తీసిన ‘ఘర్షణ’ షాట్లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ‘తన సినిమాలని తనే కాపీ .. పేస్ట్ చేసుకుంటున్నాడు’ అంటూ గౌతమ్ మీనన్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గౌతమ్ మీనన్ తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని స్టార్ హీరోలు సైతం ఆశ పడుతుంటారు. కానీ ఇలా తీసిన సినిమానే మళ్ళీ మళ్ళీ తీస్తే వాళ్ళకు ఆ అభిప్రాయం కూడా మారిపోయే ప్రమాదం ఉంది అనడంలో సందేహం లేదు.


తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus