మాస్ సినిమాలా మజాకా!!!

  • September 28, 2016 / 05:59 AM IST

టాలీవుడ్ లో మాస్ సినిమాలు ఉన్న హవా క్లాస్ సినిమాలకు ఉండదు అంటే ఒప్పుకోక తప్పని నిజం అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో మాస్ సినిమాలు హిట్ అయితే కూడా అలాంటి కలెక్షన్స్ తో దుమ్ము రేగిపోతుంది బాక్స్ ఆఫీస్ కి. విషయం ఏమిటంటే….తాజాగా అసలు ఏ సినిమా ఎలా ఉంది…ఎంతవరకూ ప్రేక్షకులకు నచ్చింది అని నిజమైన పల్స్ తెలుసుకుందాం అని ఒక మీడియా సంస్థ వారు ప్రయత్నిస్తే.. వారికి నిజంగా మతిపోయే నిజాలు తెలశాయట. ఇంతకీ ఏంటి ఆ నిజాలు అంటే….మీ మీడియా సంస్థ వారు ఒక ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్ళి…ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడే క్రమంలో అతను టీవీలో బిచ్చగాడు సినిమా చూస్తున్నడట. ఎలా ఉంది సినిమా నచ్చిందా? అంటే సూపర్ అన్న….చాలా బావుంది…చాలా రియల్ గా ఉంది అంటూ ఎగ్సైట్ అయిపోయాడట.

అంతగా సినిమాలో ఏం నచ్చింది అంటే.. అమ్మ కోసం ఏ కొడుకు అలా చేస్తాడన్నా అంటూ ఆనందంతో ఊగిపోయి మరీ అనేక విషయాలు చెప్పాడట. అదే క్రమంలో ఈ మధ్య  ఏం సినిమాలు చూశావ్ అని ఒక ఫ్యాక్టరీ కార్మికుడిని అడగగా…, ఏ సినిమా నీకు బాగా నచ్చింది అని అడగగా…వెంటనే జనతా గ్యారేజ్ సినిమా పేరు చెప్పేశాడట. ”ఒక్కసారైన కూడా ఆ సినిమా చూడాలన్నా. మనం చెట్లన్నీ కొట్టేస్తున్నాం. ఆ సినిమాలో మంచి మెసేజ్ చెప్పాడన్నా” అంటూ ఆ కార్మికుడు తెలిపాడని సమాచారం. ఇలా ఈ రెండు మాస్ సినిమాలు కావడం, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడం వల్లనే భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా…ఈ సినిమా దర్శకులను మెచ్చుకుని తీరాల్సిందే మరి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus