బన్నీ- హరీష్ ల సినిమాకి కొత్త సమస్య!
- July 11, 2016 / 07:57 AM ISTByFilmy Focus
ప్రస్తుతం హరీష్ శంకర్ సినిమాలో సరికొత్త లుక్ కోసం టెస్ట్ లుక్ లు చేస్తూ.. యమ బిజీగా ఉన్న అల్లు అర్జున్ కు ప్రముఖ నిర్మాత రమేష్ పుప్పాల సర్ప్రైజ్ ఇచ్చాడు. హరీష్ శంకర్ కి “మిరపకాయ్”తో సెకండ్ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత రమేష్ పుప్పాల, ఆ సినిమా విడుదలకు ముందే హరీష్ తో వరుసగా మూడు సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకోవడంతోపాటు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట.
అయితే.. “శ్రీమన్నారాయణ, పైసా” లాంటి సినిమాల వల్ల దారుణంగా నష్టపోయిన రమేష్ పుప్పాల నిర్మాణానికి కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నాడు. ఇటీవల హరీష్ ను “నాకో సినిమా తీసిపెట్టు” అని రిక్వెస్ట్ చేశాడట. అయితే.. హరీష్ చాలా సింపుల్ గా “సారీ” చెప్పాడట. ఈ విషయమై రమేష్ పుప్పాల బాగా సీరియస్ అయ్యాడని తెలుస్తోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















