మహేష్ అభిమానులకు అద్భుత అవకాశం..!!
- June 18, 2016 / 03:07 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే అవకాశాన్నిఆయన అభిమానులు అందుకోనున్నారు. బ్రహ్మోత్సవం తర్వాత తమిళ దర్శకుడు మురుగ దాస్ దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమాలో ప్రతిభావంతులైన మహేష్ అభిమానులు నటించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో ఆడిషన్స్ మొదలయింది.
ఆసక్తిగల వారిలో నటన పై అవగాహన ఉన్నవారిని పరిశీలిస్తున్నారు. మొదటి రౌండ్ లో ప్రతిభ చూపించిన వారితో నేరుగా దర్శకుడు మురుగ దాస్ మాట్లాడి ఎంపిక చేయనున్నట్లు వినికిడి. సమ్మర్ టూర్లో ఉన్న సూపర్ స్టార్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కి రానున్నారు. వచ్చిన వెంటనే కొత్త సినిమా పనుల్లో నిమగ్నం కానున్నారు. రూ. 80 కోట్లతో తెలుగు, తమిల్ భాషల్లో నిర్మితం కానున్న ఈ సినిమాలో నటించే అరుదైన అవకాశం ఎవరికీ దక్కుతుందో చూడాలి. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటించనున్నఈ మూవీ వచ్చేనెల 19 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















