సరిలేరు నీకెవ్వరుకి ఎక్స్ ట్రా సీన్స్ యాడ్ చేస్తున్నారు

ఒక సినిమా విడుదలయ్యాక.. కంటెంట్ ను జనాలు యాక్సెప్ట్ చేశారంటే.. రెండోవారం లేదా మూడోవారంలో సీన్స్ యాడ్ చేస్తారు జనాలను థియేటర్లకు రప్పించడానికి. ఒకవేళ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు అంటే మాత్రం సీన్స్ కత్తిరిస్తారు. అయితే.. సరిలేరు నీకెవ్వరు చిత్రం మొదటి కోవకు చెందిన సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇంకా చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.

అయితే.. సినిమా మూడోవారంలోకి ఎంటర్ అవుతుండడంతో చిత్రానికి కొన్ని సన్నివేశాలు యాడ్ చేసేందుకు సిద్ధమవుతోంది చిత్రబృందం. రష్మిక-మహేష్ కాంబినేషన్ సీన్స్ మరియు ట్రైన్ ఎపిసోడ్ లోని మరికొన్ని సీక్వెన్స్ లను యాడ్ చేయనున్నారు. సొ, సినిమాని రిపీటెడ్ గా థియేటర్లో చూడాలనుకునే అభిమానులు రేపటి నుండి కొత్త సీన్స్ చూడొచ్చన్నమాట. ఈ యాడెడ్ సీన్స్ కలెక్షన్స్ ను ఏమేరకు ప్రభావితం చేస్తాయి అనేది చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus