ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు ఏఎల్ విజయ్. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. మరి, ఇంతలో ఏమైందో గానీ, ఇప్పుడీ జంట విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఏమిటో గానీ, ఈ విషయాన్ని గాసిప్ రాయుళ్ళు బాగా వాడుకుంటున్నారు.
రకరకాల గాసిప్ లు పుట్టిస్తున్నారు. అమలకు అత్తారింటిలో వేదింపులు వున్నాయని ఓ గాసిప్. ఆలాగే విజయ్ కి కూడా అమల క్యారెక్టర్ పై అనుమానం వుందని మరో గాసిప్. ఇంకాస్త ముందుకు వెళ్లి.. అమల, తమిళ్ కు చెందిన ఓ స్టార్ హీరోతో చాలా క్లోజ్ గా ఉంటుందని, ఇది నచ్చక విజయ్ ఇక అమల వద్దనుకున్నాడని.. ఇలా ఎవరి ఇష్టం వచ్చిననట్లు వారు గాసిప్ లు వండేస్తున్నారు. అమల, విజయ్.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ విషయంపై క్లారిటీ ఇస్తే గాని ఈ గాసిప్ లకు తెరపడేట్లు కనిపించడం లేదు.