సెల్ఫీతో షాకిస్తోన్న నిధి అగర్వాల్!

  • November 7, 2020 / 01:21 PM IST

‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటి నిధి అగర్వాల్ ఆ తరువాత ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించింది. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు, గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో నిధి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ బ్యూటీ సోయగాల గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. వెండితెరపై వీలైనంత గ్లామరస్ గా కనిపించాలని చూస్తుంటుంది.

ఇప్పటికే నిధికి యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటుంది. తాజాగా బాత్రూమ్ సెల్ఫీ అంటూ ఓ ఫోటో షేర్ చేసి షాకిచ్చింది నిధి. లాక్ డౌన్ లో సినిమా షూటింగ్ లు లేక సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఆమె ఏకంగా బాత్రూమ్ సెల్ఫీ పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీలో ఆమె లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

లో దుస్తులు ధరించి ఆమె తీసుకున్న సెల్ఫీ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోకి ఇప్పటివరకు ఆరు లక్షలకు పైగా లైక్స్, వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అవుతోంది. కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus