ప్రేమ వార్తల పై స్పందించి.. క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్..!

  • October 23, 2020 / 07:43 PM IST

కాస్త ఫేమ్లో ఉన్న హీరోయిన్ల పై ప్రేమ వార్తలు రావడం సహజమే. ఓ ప్రముఖ హీరోతో డేటింగ్ లో ఉందన.. త్వరలో అతన్నే పెళ్లి చేసుకోబోతుందని కూడా ప్రచారం జరగడం మనం చూస్తూనే వస్తున్నాం. తీరా వీటి గురించి ఆ హీరోయిన్ ను ఆరా తీస్తే.. అలాంటిదేమి లేదని.. ఆ హీరో తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని మొహమాటానికి ఓ మాట చెబుతుంటారు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. ప్రస్తుతం నిధి అగర్వాల్ పై కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి.

గతంలో ఈమె క్రికెటర్ అయిన కె.ఎల్.రాహుల్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మేము ఎప్పట్నుంచో ఫ్రెండ్స్ అని చెప్పి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది నిధి. ఇదిలా ఉండగా… ఇప్పుడు కూడా నిధి అగర్వాల్ ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆ హీరోతోనే నిధి పెళ్లి ఫిక్సయిపోయిందని కూడా ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఈ వార్తల పై నిధి క్లారిటీ ఇచ్చింది. ‘నేనెవరితోనూ డేటింగ్ చెయ్యడం లేదు. నా పై వస్తోన్న పెళ్లి వార్తలను క్కూడా నమ్మొద్దు. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా సినిమాల పైనే ఉంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus