ఎవరికీ తెలియకుండా ఏళ్లపాటు రిలేషన్ ఉన్న జంటల.. అందులోనూ స్టార్ సెలబ్రిటీల జంట అంటే వరుణ్ తేజ్– లావణ్య త్రిపాఠి అనే చెప్పాలి. నాలుగైదేళ్లు వీరిద్దరూ రిలేషన్ ఉండి ఆ తర్వాత పెళ్లి అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. అప్పటికే కొంతమంది డౌట్ ఉన్నా.. ఎక్కడా ఈ ఇద్దరూ బహిరంగంగా కనిపించకపోవడంతో నమ్మకం రాలేదు. మరి ఇంట్లో వాళ్లకు వారి ప్రేమ గురించి తెలుసా అంటే.. మాకూ తెలియదు అని అంటున్నారు వరుణ్ సోదరి నిహారిక. ఆమె నిర్మాణంలో రూపొందిన ‘రాకాస’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు.
వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠిల ప్రేమ గురించి తొలుత మీకే తెలుసట కదా అని అడగ్గా.. వారి విషయం మాకు కూడా ముందు తెలియదు. వాళ్ల లవ్ స్టోరీ గురించి ఓ నాలుగేళ్ల తర్వాత తెలిసింది. ఇండస్ట్రీలో వరుణ్ తేజ్‌కి ఎక్కువమంది స్నేహితులు లేరు. అందుకే ఆ విషయం సీక్రెట్‌గా ఉండిపోయింది. ఓ సంవత్సరం అన్నయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు లావణ్య వచ్చింది. మా అన్నయ్య ఎవరినీ పార్టీలకు పిలవడు కాబట్టి అప్పుడే వాళ్లు లవ్‌లో ఉన్నారని అర్థమైంది అని నిహారిక చెప్పారు. ఇక వరుణ్ – లావణ్య వివాహం 2023లో జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ఇటీవల ఓ కుమారుడు జన్మించాడు.
అలాగే మరో ఆసక్తికర విషయం కూడా చెప్పారు నిహారిక. అందరూ వరుణ్‌ని ఇంట్రోవర్ట్ అని అనుకుంటారు. కానీ, కాదని క్లారిటీ ఇచ్చింది. బయటకు అలా కనిపిస్తాడంతే అని నవ్వేసింది. ఇంట్లో అన్నయ్య రౌడీ.. నన్ను బాగా ఏడిపిస్తాడు అని మరింత క్లారిటీ ఇచ్చింది. ఇదంతా ఓకే ‘మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?’ అని అడిగితే.. తప్పకుండా చేసుకుంటానని, అయితే ఇప్పుడు దాని మీద దృష్టిపెట్టడం లేదన్నారు. నిహారికకు ఇప్పటికే పెళ్లి అయి విడాకులు అయిన విషయం తెలిసిందే. ఇక ‘రాకాస’ సినిమా విషయానికొస్తే సంగీత్ శోభన్ – నయన్ సారిక కాంబినేషన్‌లో మానసా శర్మ తెరకెక్కించారు. ఏప్రిల్ 3న సినిమాను రిలీజ్ చేస్తున్నారు.