Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎప్పుడూ తన నిర్ణయాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. హీరోయిన్‌గా వచ్చిన అవకాశాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, ఆమె తన ప్రయాణాన్ని ఆపకుండా సినీ ఇండస్ట్రీలోనే నిర్మాణరంగాన్ని ఎంచుకుంది. ముఖ్యంగా నిర్మాతగా మారి తన ప్రతిభను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్న నిహారిక, ఇప్పటికే ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

Niharika Konidela

ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దర్శకురాలు మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ ‘రాకాస’లో సంగీత్ శోభన్, సయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇది ఇలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. విషయం ఏమిటంటే – నిహారిక ఐదేళ్ల క్రితం మానస శర్మకు రాసిన ఒక లేఖ. ఆ లేఖలో ‘మనిద్దరం కలిసి సినిమా చేద్దాం’ అని నిహారిక పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే కాంబినేషన్ నిజంగా తెరపైకి రావడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ విషయాన్ని గమనించిన మెగా ఫ్యాన్స్, నిహారిక తన మాట మీద నిలబడే వ్యక్తి అని ప్రశంసిస్తున్నారు. ‘రాకాస’ సినిమా కూడా హిట్ అయ్యి నిహారికకు మరో విజయాన్ని అందించాలని కోరుకుంటున్నారు.

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus