Niharika: మామిడి పండు తింటే ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నిహారిక!

నిహారిక కొణదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నిహారిక ఇండస్ట్రీలో యాంకర్ గా, హీరోయిన్ గా సందడి చేశారు. ఇకపోతే గత కొంతకాలంగా ఈమె తన భర్తకు దూరంగా ఉన్నారని,విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నా ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందించలేదు. ఇకపోతే గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి నిహారిక గత వారం రోజులుగా ఎంతో యాక్టీవ్ అయ్యారు.

ఈ క్రమంలోనే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే కాకుండా పచ్చి మామిడి పండు తింటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇలా మామిడిపండు తింటూ వివిధ రకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటి ఫోటోలను ఈమె షేర్ చేస్తూ మామిడికాయలు లేకుండా సమ్మర్ ఏంటీ అని క్యాప్షన్ పెట్టారు.

ఇలా నిహారిక (Niharika) పచ్చి మామిడిపండు తింటూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్స్ ఈ ఫోటోల పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఈ ఫోటోల పై స్పందిస్తూ ఏంటీ నిహారిక ఏదైనా విశేషమా… త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిహారిక 2020వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే గత కొద్దిరోజులుగా వీరిద్దరూ ఎక్కడా కూడా కలిసి కనిపించకపోవడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక చైతన్య మధ్య నిజంగానే మనస్పర్ధలు వచ్చాయా వీరిద్దరూ విడిపోతున్నారా లేక ఇవన్నీ అవాస్తవాలేనా అనే విషయం తెలియాలి అంటే ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus