ఆగస్టు 30 , 31 న దేశవ్యాప్తంగా జనాలంతా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్నా లేదా తమ్ముడికి రాఖీ కట్టి.. వాళ్ళు కలకాలం సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు సోదరీమణులు.అలాగే అమ్మలో సగం… నాన్నలో సగం అయ్యి తమ చెల్లి లేదా అక్క.. వంటి వారిని సంతోషంగా ఉండాలని సోదరులు సైతం కోరుకుంటూ వారితో రాఖీ కట్టించుకుంటూ ఉంటారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ రక్షా బంధన్ ను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈసారి ఆగస్టు 30న కొంతమంది ,ఆగస్టు 31న ఇంకొంత మంది రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ ఇంట్లో కూడా రాఖీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా మెగా ఫ్యామిలీలో కూడా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.
మెగా డాటర్ నిహారిక తన అన్న వరుణ్ తేజ్ కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంది. అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి కూడా రాఖీ కట్టి.. తన ప్రేమను చాటుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.