మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూతురు నిహారిక ఎన్నో ఆశలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి సినిమా “ఒక మనసు” ఊహించినంత విజయం సాధించలేక పోయింది. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన మెగా ప్రిన్సెస్ ఇప్పుడిప్పుడే కథల డిస్కషన్లో పాల్గొంటోంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని కసిగా ఉందంట. స్టార్ హీరోతో నటిస్తేనే ఆ హోదా వస్తుందని ఆలస్యంగా తెలుసుకున్న కొణిదెల వారి ఆడపడుచు నందమూరి హీరోతో నటించాలని ఆశ పడుతోందని తెలిసింది.
గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని మీడియాతో చెప్పిన నిహారిక, అతనితో కలిసి సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. మెగా కుటుంబానికి, నందమూరి ఫ్యామిలీకి సినిమాల పరంగా మంచి పోటీ ఉంది. అదే విధంగా భారీ అభిమాన ఘనం కూడా ఉంది. కాబట్టి తారక్ తో కలిసి నటిస్తే ఆ సినిమా ట్రెండ్ సృష్టించడం ఖాయం. ఒకే చిత్రంతో స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోవచ్చు. మెగా డాటర్ ప్లాన్ బాగానే ఉంది కానీ ఇందుకు యంగ్ టైగర్ ఒప్పుకుంటాడా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.