నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు ఈమె మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టారు. యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిహారిక అనంతరం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. కానీ హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాకపోవడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి జీవితంలో కూడా నిహారిక ఎక్కువ రోజులు కొనసాగలేక తన భర్తకు విడాకులు ఇచ్చారు.
భర్త నుంచి దూరంగా ఉంటున్నటువంటి నిహారిక ఇటీవల కాలంలో తరచూ వెకేషన్ వెళ్తూ తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని గడుపుతో ఉన్నారు. అయితే తాజాగా ఈమె తాయిలాండ్ వెళ్లారని తెలుస్తుంది. సాధారణంగా థాయిలాండ్ వెళ్లినవారు అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తమకి ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఈమె మాత్రం చాలా భిన్నంగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఒంటరిగా వెకేషన్ వెళ్ళినటువంటి ఈమె అడవుల బాట పట్టారు. అడవులలో కొంతమంది వ్యక్తుల సహాయంతో ఈమె అడవి మొత్తం తిరుగుతూ ఆ అందాలన్నింటినీ ఆస్వాదిస్తున్నారు. అలాగే ఏనుగులతో కలిసి దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. వాటికి ఫుడ్ పెట్టడం స్థానాలు చేయించడం వంటి వాటిని కూడా ఈమె షేర్ చేస్తున్నారు. ఇక ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ ఏంటి తెలుసుకొని మనం వాటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు
కానీ నిహారిక (Niharika) మాత్రం అడవులలో దొరికే దుంపలు, కూరగాయలను కాల్చి వాటితో స్వయంగా ఆమె ఆహారం తయారు చేసుకుని తింటున్నారు. అయితే ఈ ఆహారం అంత వెదురు బొంగులలో తయారు చేసుకొని తింటూ ఈమె ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు అదేంటి నిహారిక థాయిలాండ్ వెళ్లి ఎంచక్కా మసాజ్ చేయించుకుంటూ బీచ్ దగ్గర ఎంజాయ్ చేయకుండా ఇలా అడవుల బాటపట్టావు అంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!