Nikhil, Pallavi: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నిఖిల్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటో!

యంగ్ హీరో నిఖిల్ తండ్రయ్యాడు. ఆయన భార్య పల్లవి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది.హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈరోజు అనగా ఫిబ్రవరి 21 న ఆమెకు డెలివరీ అయ్యింది. నిఖిల్, పల్లవి దంపతులకి ఇదే మొదటి సంతానం. ఈ విషయాన్ని నిఖిల్ అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. తన బిడ్డను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని కూడా షేర్ చేశాడు. ఫాదర్ హుడ్ ను నిఖిల్ ఆస్వాదిస్తున్నట్టు ఈ ఫోటో ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది కూడా..! ఇక నిఖిల్, పల్లవి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఆసుపత్రికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెటిజెన్లు కూడా నిఖిల్ కి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కోవిడ్ టైంలో అనగా.. 2020లో నిఖిల్, పల్లవి..లు వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే.

సినిమాల విషయానికి వస్తే ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన (Nikhil) నిఖిల్…. ఆ తర్వాత చేసిన ’18 పేజెస్’ ‘స్పై’ వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘స్వయంభు’ అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం స్పెషల్ గా కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు.. వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు నిఖిల్.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus