“దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అనే నానుడి ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా, ముఖ్యంగా హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడుతుంటాం. అయితే.. ఆ నానుడి ఇప్పుడు హీరోలకు కూడా వర్తిస్తుంది. ఇదివరకూ ఒక పది పదిహేను సినిమాల వరకూ రెమ్యూనరేష్ పెంచకుండా మార్కెట్ వేల్యూ పెంచుకుంటూ వెళ్ళిన యువ కథానాయకులు ఇప్పుడు గేరు మార్చు రెమ్యూనరేషన్ పెంచుకుంటూపోతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీయార్ వంటి హీరోలు ఇప్పటికే 15 – 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ నిర్మాతలనీ హడలెత్తిస్తున్నారు. వారికున్న మార్కెట్ క్రేజ్ పరంగా అన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకోవడం అనేది సమంజసమే అయినప్పటికీ, సినిమా కాస్త అటుఇటు అయితే.. నిర్మాత రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పోనీ వాళ్ళంటే సీనియర్ హీరోలు కాబట్టి పెంచారనుకొందాం.. కానీ ఇప్పుడిప్పుడే హీరోలుగా సెటిల్ అవుతున్న యువ కథానాయకులు కూడా ఒక హిట్ పడగానే అమాంతం కోటి నుంచి కోటిన్నర దాకా రెమ్యూనరేషన్ ను పెంచుతుండడం చర్చనీయాంశం అయ్యింది. “స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య”తో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న నిఖిల్ ఆ తర్వాత “శంకరాభరణం”తో దారుణమైన పరాజయాన్ని చవిచూశాడు. మళ్ళీ మొన్న వచ్చిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో మోడరేట్ హిట్ అందుకొన్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.