శ్రీకాంత్ తనయుడి సినిమా విడుదల తేదీ ఖరారు

టాలీవుడ్ లో మరో వారసుడు తెరపైకి రావడానికి రంగం సిద్ధమైంది. కెరీర్లో 100 సినిమాల మైలురాయిని దాటిన నటుల్లో ఒకరైన శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘నిర్మల కాన్వెంట్’ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించి నిర్మాణ భాగస్వామిగా ఉన్న నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు.

నిర్మలా కాన్వెంట్ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ “ఇది సాధారణ ప్రేమ కథ మాత్రమే కాదని, అంతర్లీనంగా ఓ సందేశం ఉంటుందని, అది అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. రోషన్ తొలి సినిమా నటుడిలా అనిపించలేదని కితాబిచ్చిన నాగ్ ఈ నెల 8న రోషన్ సాలూరి సంగీతమందించిన పాటలు విడుదల చేస్తున్నట్టు” తెలిపారు.

సినిమాలో విరామం తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న నాగ్ క్లైమాక్స్ వరకూ తెరపై కనపడనున్నారు. ఈ సినిమా కోసం అనంత శ్రీరామ్ రాసిన ‘కొత్త కొత్త భాష’ పాటను సినిమాలో రెహమాన్ కుమారుడు అమీన్ పాడగా, ప్రచారం కోసం అదే పాటను నాగ్ ఆలపించారు. ఈ ప్రయత్నాలన్నీ శ్రీకాంత్ తనయుణ్ణి హీరోగా పాస్ చేయించేందుకే అని వేరే చెప్పాలా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus