విక్రమ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న నితిన్..!

నలభై ఏళ్ళ పాటు నటనే శ్వాసగా బతికిన విశ్వనటుడు కమల్ హాసన్. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లారు. సొంత పార్టీ పెట్టి ప్రజల కష్టాలు తీర్చడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే అతను కంప్లీట్ చేసిన విశ్వరూపం 2, శభాష్‌నాయుడు చిత్రాలను తొందరగా విడుదల చేయనున్నారు. దీని తర్వాత కమల్ హాసన్ సినిమాలో నటించడం కష్టమే. అయితే సినిమాపై ఉన్న మమకారంతో మంచి కథలను నిర్మించాలని కమల్ అనుకుంటున్నారు. అందుకే సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఒక క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇంతకుముందు కమల్ బ్యానర్లో వచ్చిన తూంగావనం(చీకటి రాజ్యం) చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేశ్‌ సెల్వని డైరక్టర్ గా తీసుకున్నారు. ఫ్రెంచ్ సినిమా కథతో తెరకెక్కనున్న ఇందులో హీరోగా విక్రమ్ ని కొన్ని రోజుల క్రితం ఖరారు చేశారు. ఈ సినిమాలో ఓ కీల‌క‌పాత్ర‌లో నితిన్ (Nithiin) నటించ‌బోతున్న‌ట్టు తెలిసింది. ఇతరుల సినిమాల్లో కనిపించని నితిన్ మాతృక అయిన‌ ఫ్రెంచ్ సినిమా, అందులోత‌న పాత్ర బాగా న‌చ్చ‌డంతో ఆ సినిమాలో న‌టించేందుకు నితిన్ ఒకే చెప్పినట్లు సమాచారం. రీసెంట్ గా “ఛ‌ల్ మోహ‌న్ రంగ” చిత్రాన్ని పూర్తి చేసిన నితిన్.. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత కమల్ సినిమాలో నటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus