సింగిల్ ఫరెవర్ భీష్మకు సోలో రిలీజ్ మాత్రం దొరకలేదు

  • February 19, 2020 / 12:51 PM IST

నితిన్ తాజా చిత్రం “భీష్మ” మొదలైనప్పట్నుంచి పాజిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి. దాంతో నితిన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా “భీష్మ” నిలుస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. టీజర్ & సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచితే.. మొన్న విడుదలైన ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను కాస్త తగ్గించింది. అయినప్పటికీ సినిమా మీద జనాలకి గట్టి నమ్మకమే ఉంది. సంక్రాంతి రిలీజ్ ల తర్వాత సరైన హిట్ చూడని బాక్సాఫీస్ కి “భీష్మ” ఫుల్ మీల్స్ పెడుతుంది అనుకున్నారు కానీ.. నితిన్ సినిమాకు పోటీగా మరో మూడు చిన్న సినిమాలు విడుదలవుతుండడంతో “భీష్మ”కి సోలో రిలీజ్ దొరకలేదు అని స్పష్టమైంది.

ఫిబ్రవరి 21న “భీష్మ”తోపాటు “ప్రెజర్ కుక్కర్, వలయం, చీమ ప్రేమ మధ్యలో భామ” అనే మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ మూడిట్లో “ప్రెజర్ కుక్కర్” సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. దాంతో “భీష్మ” సోలో రిలీజ్ స్టేటస్ ఎంజాయ్ చేసే ఛాన్స్ కోల్పోయింది. కంపల్సరీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్పితే ఆడియన్స్ “భీష్మ”ను పట్టించుకోరు. మరి నితిన్ “భీష్మ”ను తన కెరీర్ బెస్ట్ హిట్ గా నిలుపుకుంటాడో లేదో చూడాలి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు.

Most Recommended Video


వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus