Nithya Menen: నన్ను కూడా అలా చూశారు.. క్యాస్టింగ్ కౌచ్ పై నిత్యామీనన్!

నటన పరంగా ఎలాంటి పాత్రలో అయినా జీవించగల నటి నిత్యా మీనన్. చైల్డ్ ఆర్టిస్టుగానే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అన్ని భాషాల చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలోని సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. కేరీర్ పరంగా తనకు నచ్చిన సినిమాలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తూ వస్తోంది. సినిమాల పరంగా అలరిస్తున్న నిత్యా మీనన్.. తన పర్సనల్ లైఫ్ ను కూడా ఆసక్తికరంగా లీడ్ చేస్తోంది. అయితే, ఇప్పటి వరకు పెళ్లికి దూరంగానే ఉందీ బ్యూటీ.

పెళ్లి ప్రస్తావన వచ్చినా వెంటనే ఘాటుగా స్పందిస్తూ వచ్చింది. మ్యారేజ్ పై వచ్చిన రూమర్లను కూడా ఖండించింది. తాజాగా నిత్యా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. భారతీయ సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంశాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. మొదట్లో ఈ అంశాలపై మాట్లాడేందుకు నటీ నటులు జంకేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చాలా మంది హీరోయిన్లు ఈ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ నిత్యామీనన్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంశాలపై స్పందించింది.

తన జాగ్రత్తలో తాను ఉంటానని నిత్యామీనన్ (Nithya Menen) అంటోంది. ఇక్కడే కాదు. కామాంధులు అన్నిరంగాల్లోనూ ఉంటారు. సినీరంగంలోనే ఇలాంటి వ్యక్తులు ఉంటారని చెప్పలేం అని చెబుతోంది. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎలాంటి ఇబ్బంది నేను ఫేస్ చేయ‌లేదు. కానీ తమిళంలో మాత్రం ఓ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను. ఓ హీరో నన్ను బాగా వేధించాడు.

సీన్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అసభ్యకరంగా తాకుతూ లొంగ‌తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాడని చెప్పింది. మహిళలు తమ హక్కుల గురించి, భద్రత గురించి తాము సొంతగా ఆలోచించుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిత్యామీనన్ సూచిస్తోంది. సినిమాలే జీవితంగా బతకడం తనకు చాతకాదని అంటోంది నిత్యామీనన్.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus