నాని హీరోగా తెరకెక్కిన అలా మొదలైంది సినిమాతో నిత్యామీనన్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న నిత్యామీనన్ ఆ తరువాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో నటిగా మంచి పేరుతో పాటు విజయాలను సొంతం చేసుకున్నారు. అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉన్న నిత్యామీనన్ ఈతరం సావిత్రిగా పేరు తెచ్చుకున్నారు. నేడు నిత్యామీనన్ పుట్టినరోజు. ఎనిమిదేళ్ల వయస్సులోనే బాలనటిగా నిత్యామీనన్ కెరీర్ ను మొదలుపెట్టారు.
తొలి సినిమాలో నిత్యామీనన్ టబుకు సోదరి పాత్రలో నటించారు. సెవెన్ ఓ క్లాక్ అనే కన్నడ మూవీతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నిత్యామీనన్ తెలుగు, మలయాళం, హిందీ మూవీ ఇండస్ట్రీలలో నటిగా సత్తా చాటారు. అలా మొదలైంది సినిమాలోని తన పాత్రకు ఆమెనే డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తను నటించిన సినిమాల్లో నిత్యామీనన్ పాటలు కూడా పాడారు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను అందుకున్న నిత్యామీనన్ మణిపాల్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదివారు.
నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కాబోయే వ్యక్తి తెలివైన వాడు, అందమైన వాడు, దయగలవాడు కావడంతో పాటు ఎప్పుడూ గడ్డంతో కనిపించాలని వెల్లడించారు. రేవతి, టబు నిత్యామీనన్ కు ఇష్టమైన నటులు కాగా ఇంగ్లీష్, మలయాళం, హిందీ, తెలుగు, కన్నడ భాషలు నిత్యామీనన్ బాగా మాట్లాడగలరు. ఆటలు ఆడటం, ఆటలు చూడటం నిత్యామీనన్ కు అస్సలు నచ్చవు.
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!